డోన్: డోన్ లో గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి నివాళులర్పించిన మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు
Dhone, Nandyal | May 13, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని డేవిడ్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ గుమ్మకొండ గోపాల్ (56) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం, తోటి లారీ డ్రైవర్లు మృతుడి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.