ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు మృతి, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని అధికారులు నిర్ధారణ
Ongole Urban, Prakasam | Jun 27, 2026
గడిచిన 24 గంటల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు మృతి చెందారు. వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తూ పల్నాడు జిల్లాలో లారీన్ ఢీ కొట్టి మృతి చెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తుంది. అంతేకాకుండా బేస్తవారిపేట మండలం చింతలపాలెం సమీపంలో కారు అదుపుతప్పి రసూల్ అనే వ్యక్తి సంఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు. ఇక బేస్తవారిపేట మండలం పూసలపాడు వద్ద సుధాకర్ వ్యక్తి మృతి చెందాడు.