బండారులంకలో గోమాత శ్రీలక్ష్మీ కి ఘనంగా శ్రీమంతం నిర్హించిన గోయాజమాని దంపతులు#@
గోమాత లక్ష్మీకి సీమంతం.. బండారులంక మాడావారివీధిలో గోమాత శ్రీలక్ష్మీకి శాస్త్రోక్తంగా బుధవారం సీమంతం నిర్వహించారు.గ్రామానికి చెందిన బళ్ల కిషోర్,భవానీ దంపతులు ఎంతో ప్రేమగా పెంచిన గోమాత శ్రీలక్ష్మీ తొలి చూలు కట్టడంతో గ్రామస్తులు,పెద్దలు,మహిళల సమక్షంలో సీమంతం నిర్వహించారు.కిషోర్,భవానీ దంపతులతో పాటు బళ్ల హనుమంతరావు,హైమావతి, బళ్ల పార్వతీశం,సూర్యావతి..ఆశపు పల్లపరాజు,లక్ష్మీకుమారి దంపతులు కర్తలుగా గోపూజా కార్యక్రమాలు నిర్వహించారు.బళ్ల సత్తిబాబు పంతులు శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. ముత్తైదువులకు చందన తాబూలాలు అందించారు.