ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | May 31, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామ సమీపంలో ఆదివారం పేకాట ఆడుతున్న ముగ్గురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.2,050 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.