కడప: కడప-చెన్నై హైవేపై ప్రమాదం, రాజంపేట వైపు వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఒంటిమిట్ట క్రాస్ వద్ద బోల్తా
Kadapa, YSR | Sep 25, 2025 YSR కడప జిల్లా జిల్లా కడప-చెన్నై హైవేపై ప్రమాదం జరిగింది. రాజంపేట వైపు వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఒంటిమిట్ట క్రాస్ వద్ద గురువారం ఉదయం బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిని స్థానికులు కాపాడి బయటకు తీసుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.