నందికోట్కూరు: పగిడ్యాల జగనన్న కాలనీలో: పిడుగు విరిగిన విద్యుత్ స్తంభం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో గత రాత్రి పిడుగుపాటుకు విద్యుత్ స్తంభం విరిగిపోయిందని స్థానికులు బుధవారం తెలిపారు, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని వివరించారు, విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరారు, రెండు రోజుల కిందట పగిడ్యాల మండలంలో పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే.