మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, విద్యార్థులు రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈ నెల 15 వరకు, అలాగే రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 18 వరకు ఫీజులు చెల్లించుకోవచ్చు. నిర్ణీత తేదీలలోపు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఫీజు చెల్లింపును పూర్తి చేయాలని DEO సూచించారు.