ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం ఆదివారం కలకలం రేపింది మృతదేహాన్ని చూసిన స్థానికులు ఒంగోలు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మధుసూదన్ రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జిజిహెచ్ వైద్యశాలకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సై మధుసూదన్ రావు మాట్లాడుతూ మృతుడి వద్ద ఎటువంటి ఆనవాళ్లు లేవని తెలిపారు మృతుని ఆచూకీ తెలిస్తే ఒంగోలు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు