బనగానపల్లె: బనగానపల్లెలో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయకపోవడంతో ఏజెన్సీ వద్ద బుధవారం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ప్రతిరోజు సిలిండర్ కోసం వచ్చి వెనక్కి వెళ్తున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన బుక్ చేసిన మార్చి, ఏప్రిల్ నెలలో వచ్చిన గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయడం లేదని మహిళలు తెలిపారు . నెల రోజుల నుండి గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడంలేదని మహిళలు మీడియాకు తెలిపారు.