నంద్యాల అర్బన్: నోయిడా కార్మికులకు మద్దతుగా నంద్యాలలో కార్మిక సంఘాల నిరసన
Nandyal Urban, Nandyal | May 12, 2026
నోయిడా కార్మికులకు మద్దతుగా నంద్యాలలో AITUC, CITU, IFTU నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. AITUC పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు, ధనుంజయ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ కార్మిక చట్టాలు అమలు చేయకుండా నియంతృత్వ పాలన సాగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.