బనగానపల్లె: అవుకులో మౌలాలి స్వామి బంగారు చోరి కేసును చేదించిన పోలీసులు
నంద్యాల జిల్లా అవుకు తేరు వీధిలోని మౌలాలి స్వామికి అలంకరించిన బంగారు గుర్రపు బొమ్మ చోరికి గురైన కేసును చేధించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా చోరీ చేసిన నిందితుడు బనగానపల్లెకి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. పెద్ద సరిగెత్తు సందర్భంగా బంగారు గుర్రం బొమ్మను స్వామికి నిర్వాహకులు అలంకరించారు. శనివారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో చోరికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు