ఒంగోలు అర్బన్: టిడిపి తమ వైసిపి పై అనవసరంగా బురద జరుగుతుంది: టిటిడి మైసూర్ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | Apr 29, 2026
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నామని తెలుగుదేశం పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తుందని మాజీ టీటీడీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు వై వి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన వై వి సుబ్బారెడ్డి.. టిడిపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పట్టేందుకు రాష్ట్రంలోకి సంస్థలు వస్తుంటే తమకు ఆనందమేనని అడ్డుకునే ప్రయత్నం తాము చేయబోమని అన్నారు. కానీ భూములను తక్కువ ధరలకే కంపెనీలకు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. జగన్ హయాంలోని గూగుల్ డేటా సెంటర్కు బీజం పడిందని వై వి సుబ్బారెడ్డి అన్నారు