ఖైరతాబాద్: టపాసులు కాల్చుతూ గాయపడ్డ 19 మంది మెహదీపట్నంలోని సరోజినీ దేవి ఆసుపత్రికి తరలింపు
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చుతూ గాయపడ్డ 19 మందిని మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. రెండు మేజర్ కేసులు ఉండగా, మిగతావారికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. రాత్రి అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యులు వెల్లడించారు.