నంద్యాల అర్బన్: నంద్యాలలో టిడ్కో,హౌసింగ్ స్థలాలపై మంత్రి పదవి అధికారులతో సమీక్ష
Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల పట్టణ పరిధిలో టిడ్కో గృహాలు, హౌసింగ్ స్థలాల కేటాయింపు ప్రక్రియపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ గురువారం స్థానిక ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో నంద్యాల ఆర్డీవో విశ్వనాధ్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు త్వరితగతిన ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.