నంద్యాల అర్బన్: నంద్యాలలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 22, 2026
నంద్యాలలోని టేక్కే మార్కెట్ యార్డ్లో భద్రపరిచిన ఈవీఎంల గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మాసపు తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు. డోర్ లాక్ సీళ్ల భద్రతా అంశాలను పరిశీలిస్తూ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.