సత్యసాయి జిల్లా కనుగాని పల్లి మండలం వేపుకుంట బీసీ కాలనీలో ఆదివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు పర్యటించి బీసీ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా వేసిన బోర్ కు పూజలు నిర్వహించి బోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయపాటి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ వేపకుంట బీసీ కాలనీలో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి రావడంతో ఆ సమస్య పరిష్కరించాలని ఉద్దేశంతోనే నేడు బీసీ కాలనీలో నీటి సమస్య లేకుండా నూతన బోర్ ను ప్రారంభిస్తున్నామని రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు పేర్కొన్నారు.