నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం మఠంలో కొలువుదీరిన స్వర్ణ శ్రీ మాలోల నరసింహ స్వామికి 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రతాప రుద్ర మహారాజు మొదటి పీఠాధిపతి కి బహుకరించిన ఈ విగ్రహాలు ఆనవాయితీ ప్రకారం పీఠాధిపతుల నుంచి పూజలు అందుకుంటుంది ప్రతినిత్యం స్వామి వారికి విశేష కైంకర్యాలు జరుగుతున్నాయి, పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు