అనంతపురం అర్బన్: మొక్కజొన్న పంటకు నిప్పు పెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని రైతు మృతి
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం గాండ్లపర్తి కొత్తపల్లి గ్రామానికి చెందిన గోనుగుంట్ల చింతలయ్య అనే రైతు మొక్కజొన్న పంటకు నిప్పు పెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు వ్యాపించి స్ప్రింక్లర్ పైపులకు తగలడంతో వాటిని తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తుగా నిప్పు అంటుకొని రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.