నంద్యాల అర్బన్: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం: నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Apr 5, 2026
దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న విక్టోరియా రీడింగ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి ఫరూక్,జిల్లా కలెక్టర్ రాజకుమారి కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు