బనగానపల్లె: కోవెలకుంట్ల నుంచి కర్నూలు వెళ్లే బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక, పోలీసుల కప్పగించిన కండక్టర్
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో ఆసియా అనే బాలిక ఒంటరిగా ప్రయాణిస్తుండటాన్ని గమనించిన కండక్టర్, ఆమెను బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసుల విచారణలో తన ఊరు కోవెలకుంట్ల అని, తల్లిదండ్రులు మున్ని, ఇస్మాయిల్ అని బాలిక తెలిపింది. తాను స్థానిక గాంధీ స్కూల్లో చదువుతున్నట్లు వెల్లడించింది. బాలిక వివరాల ఆధారంగా తల్లిదండ్రుల సమాచారాన్ని అందించారు