నాగలాపురం: వినోభానగర్ గ్రామంలో ప్రజలకు చెట్ల కింద వైద్యం
నాగలాపురం మేజర్ పంచాయతీ వినోబానగర్ గ్రామంలో చెట్ల కింద 104 వైద్య సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నిర్మించారు. పనులు పూర్తయి ఏడాది అయినా కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బకాయిలు అందలేదు. ప్రభుత్వం బకాయిలు చెల్లించి విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని వినియోగంలోకి తేవాలని ప్రజలు గురువారం కోరుతున్నారు