కరీంనగర్: స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి, దేశ అభివృద్ధికి పాటుపడండి: బండి సంజయ్
జీఎస్టీ సంస్కరణల ఫలితంగా స్వరాజ్ సంస్థ ట్రాక్టర్ ధర 40 వేల నుండి 80 వేల వరకు తగ్గడంతో పలువురు రైతులు వాటిని కొనుగోలు చేయగా కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ గురువారం రైతులకు అందజేశారు. స్వదేశీ వస్తువులనే వాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మనదేశంలో తయారుచేసిన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల స్థానిక కంపెనీలు, చిన్న తరహా వ్యాపారాలు బలపడతాయని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. స్వయం సమృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోది చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.