శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ద్వాదశి జ్యోతిర్లింగంముల దివ్య దర్శనం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ద్వాదశి జ్యోతిర్లింగంముల దర్శనం చేసుకున్నారు. అనంతరం, ముంబైలో జరుగుతున్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా జట్టు విజయం సాధించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.