ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగ, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు,భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | May 28, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బక్రీదు పండుగ భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. గురువారం ఉదయం నుంచి ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రత్యేకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని ప్రవర్తలు ముస్లిం సోదరులకు వివరించి చెప్పారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో పోలీసులు సిబ్బంది భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.