బిజెపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత,నడ్డా సమక్షంలో పార్టీలో చేరిక,టిడిపి,వైసిపిలను ఇప్పటికే వీడిన మహిళా నేత
చీరాలకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం వైజాగ్ లో బిజెపిలో చేరారు.బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.పోతుల సునీతకు పార్టీ కండువా కప్పి నడ్డా స్వాగతం పలికారు.టిడిపి పక్షాన 2017లో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు.2020లో ఆమె వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ పదవి పొందారు.ఆ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించారు.2024లో తనకు చీరాల టిక్కెట్ ఇవ్వలేదన్న కినుకతో జగన్ కు గుడ్ బైచెప్పారు.టిడిపిలో చేరాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోతుల సునీత బిజెపిలోకి వెళ్లారు.