ఒంగోలు అర్బన్: రాజకీయాలలో విలువలు లేని పార్టీ వైసిపి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
Ongole Urban, Prakasam | May 6, 2026
రాజకీయాలలో విలువలు లేని పార్టీ వైసీపీ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం ఒంగోలు నగరంలో టిడిపి పార్టీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ వేసిన పునాదులతో 44 ఏళ్ల నుంచి టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు, లోకేష్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు అని తెలిపారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ పని చేస్తోంది అని, టీడీపీ ఆవిర్భావంతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు