ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, ఎస్డిసిలు శ్రీధర్ రెడ్డి, మాధురి, విజయజ్యోతి, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.