సూళ్లూరుపేటను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం
- ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. బుధవారం సూళ్లూరుపేటలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ ఎకో టూరిజం కేంద్రంగా, ఫ్లెమింగో పక్షులకు శాశ్వత ఆశ్రయంగా పులికాట్ సరస్సు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పులికాట్ సరస్సు సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే ఒక గొప్ప సహజ సంపదని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు.