పట్టణ యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనాలకు దూరంగా ఉండాలి, ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన నేపథ్యంలో ఆళ్లగడ్డ పట్టణ యువత క్రికెట్ బెట్టింగ్ వ్యసనాలకు దూరంగా ఉండాలని టౌన్ సిఐ యుగంధ తెలిపారు, ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ అనేది ఒక వినోదం మాత్రమే అన్నారు, దానిని జూదంగా మార్చుకొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు అని కోరారు, ఎవరైనా ప్రత్యక్షంగా గాని యాప్ల ద్వారా గాని బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు