ధర్మవరం చేనేత విగ్రహం వద్ద సీపీఐ నాయకుల హడావుడి.
ధర్మవరం పట్టణం కదిరి గేటు సమీపంలోని చేనేత విగ్రహం వద్ద ఏఐటీయూసీ 106 వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు