పెదబయలు మండలంలోని తొట్టెడిపుట్టుకి తారురోడ్డు నిర్మించాలని గిరిజనులు వినతి
పెదబయలు మండలంలోని బొండపల్లి పంచాయతీ పరిధి తొట్టెడిపుట్టుకి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు ఒక వీడియో ప్రకటనలో సోమవారం కోరారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉపాధి హామీ పథకం ద్వారా రెండు సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన మట్టిరోడ్డు పలుచోట్ల కోతకు గురై కొట్టుకుపోయిందన్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో రహదారి బురదమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. రహదారి సమస్యపై అధికారులు స్పందించాలన్నారు.