కనిగిరి: లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
పెదచెర్లపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా లింగన్నపాలెంలో MSME పార్కు ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, పోలీస్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. వెనుకబడిన పెద చెర్లోపల్లి మండలంలో బయో గ్యాస్ ప్లాంట్ తో పాటు MSME పార్కులతో ఈ ప్రాంత ప్రజలకు సీఎం చంద్రబాబు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.