ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని వెదురు కుప్పం మండలం జక్కదొన గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన భర్త మృతి చెందడంతో ప్రభుత్వం ఇటీవల కేటాయించిన మూడు సెంట్ల గృహ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని విచారించాలని తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు.