గుంతకల్లు: గుత్తి కోటలో విద్యార్థులు, పర్యాటకులు సందడి, ట్రెక్కింగ్ చేస్తూ కోట ఎక్కిన విద్యార్థులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పురాతనమైన గుత్తి కోటలో విద్యార్థులు, పర్యాటకులు సందడి చేశారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో విద్యార్థులు, పర్యాటకులు గుత్తి కోటను సందర్శించారు. ముందుగా పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి గుత్తి కోట వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్ళారు. గుత్తి కోట వద్ద కోట సందర్శనకు వచ్చిన విద్యార్థులకు గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చౌదరి విజయభాస్కర్, కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా చేయాలని విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు.