ఉరవకొండ: బెళుగుప్పలో దంచి కొట్టిన వర్షం.. వీధులన్నీ జలమయం
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు వర్షం దంచి కొట్టింది. మెరుపులు ఉరుములు పిడుగులతో కూడిన వర్షంతో వీధులు మొత్తం జలమయంగా మారాయి. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంట ముందే మండల తాసిల్దార్ అనిల్ కుమార్ వాతావరణ శాఖ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరవేసి అప్రమత్తం చేశారు. బెళుగుప్ప పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం ఖరీఫ్ పంటల్లో కంది ఇతర పంటలకు రభీ పంటల్లో పప్పు శనగకు మేలు చేకూరుస్తుందని రైతులు పేర్కొన్నారు.