అనంతపురం అర్బన్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని కృష్ణంరెడ్డిపల్లి కి చెందిన వృద్ధురాలు బావిలో పడి మృతి
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం రూరల్ మండల పరిధిలోని కృష్ణంరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు స్థానిక నారాయణ కు చెందిన వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.