నంద్యాల అర్బన్: జిల్లా పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 105 ఫిర్యాదులు
Nandyal Urban, Nandyal | Jun 29, 2026
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు