డోన్ పట్టణంలో అగ్ని ప్రమాదం, కంబాలపాడు సర్కిల్లో ఓ టి వి షాపు పూర్తిగా దగ్ధం
Dhone, Nandyal | May 3, 2025 డోన్ పట్టణంలోని కంబలపాడు సర్కిల్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. రాఘవేంద్ర టీవీ షాప్ లో భారీ మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వారు దుకాణ యజమానులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.