సంతనూతలపాడు: చీమకుర్తి ప్రభుత్వ బాలికల ఎస్సీ హాస్టల్ విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు
చీమకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మంచినీటి ఆర్ఓ ప్లాంటును లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవహర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాలికల హాస్టల్ నందు మంచినీటి వస్త లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను హాస్టల్ వార్డెన్ తో పాటు విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడంతో లయన్స్ క్లబ్ తరఫున మంచినీటి ఆర్ ఓ ప్లాంటును నిర్మించి ఇచ్చామన్నారు. ఆర్ఓ ప్లాంట్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.