నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
Nandyal Urban, Nandyal | May 13, 2026
నంద్యాలలో హనుమాన్ శోభాయాత్రను నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టేక్కే మార్కెట్ యార్డ్ నుంచి పట్టణ పురవీధుల గుండా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు శోభాయాత్ర సాగింది. ఎంపీ బైరెడ్డి శబరి, VHP జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, టీడీపీ రాష్ట్ర నాయకుడు ఫయాజ్ పాల్గొన్నారు.