గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ 28న నిర్వహించనున్న కేజీ నుంచి పీజీ వరకూ విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ షఫీ హరన్ పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపిందన్నారు. కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళుతుందని మండిపడ్డారు. ఈ మేరకు బంద్ను జయప్రదం చేయాలని వారు కోరారు.