నంద్యాల అర్బన్: నంద్యాలలో దోపిడీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్, రూ.20000/-, స్కూటీ స్వాధీనం
Nandyal Urban, Nandyal | May 3, 2026
ఏప్రిల్ 22వ తేదీన గడివేముల మండలం కరిమధ్యల గ్రామానికి చెందిన వెంక ట స్వామి అనే రైతు వరి ధాన్యం అమ్మడం ద్వారా వచ్చిన 20000 రూపాయల నగదుతో టీవీ కొనుగోలు నిమిత్తం నంద్యాల బస్టాండ్కు వచ్చి బైర్బల్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూటీతో వెనక నుండి ఢీ కొట్టి గాయపరిచి అతనిని చంపుతాన్ని బెదిరించి అతని వద్ద 20 వేల రూపాయలు దోచుకున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుండు షేక్ షఫీ గా గుర్తించి అతని అరెస్ట్ చేసినట్లు సిఐ సుధాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు.