ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలంలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన స్థానిక పోలీసులు, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 12, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఆదివారం ఉదయం పోలీసులు కర్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని వాహనాలను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వేముల సుధాకర్ తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్పీ ఆదేశాలతో సెర్చ్ నిర్వహించామని 50 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్ఐ తెలిపారు.