ఆర్.కొత్తూరు గ్రామ శివారులలో కోడిపందాలు ఆడుతున్న నలుగురు అరెస్టు: కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ
కొయ్యూరు మండలం ఆర్.కొత్తూరు శివారులలో కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్సై పీ.కిషోర్ వర్మ ఆదివారం రాత్రి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి కోడిపందాల శిబిరంపై దాడులు నిర్వహించగా, కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,250 నగదు, 4 కోడి పుంజులు, 2 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు.