ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు, పాల్గొన్న ఎంపీ, మంత్రి ఎమ్మెల్యే నాయకులు
Ongole Urban, Prakasam | Jul 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి, MLAలు, MP మాగుంట అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే గిరిజన హక్కులకోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేశామన్నారు. వారు పుట్టి పెరిగిన ఇంటిని ఆధునికరిస్తున్నట్లు ఆయన వివరించారు.