కర్నూలు: వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నిర్వహించాలి – కొత్తూరు సత్యనారాయణ గుప్తా
వృద్ధాశ్రమాలను ప్రభుత్వం స్వయంగా నిర్వహించాలనీ, కొడుకులు ఉన్న వృద్ధులను అక్కడ చేర్పించే వారికి ఎటువంటి ప్రభుత్వ రాయితీలు లేదా సబ్సిడీలు ఇవ్వకూడదని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు.మంగళవారం ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వృద్ధాశ్రమాలు అవసరమైనవే అయినా, సంతానం లేని వృద్ధులు మాత్రమే వాటిలో ఉండటం సముచితం అన్నారు. కానీ కొడుకులు, కూతుళ్లు ఉన్న చాలామంది పెద్దలను వృద్ధాశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.