బనగానపల్లె: బనగానపల్లెలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడిన తాసిల్దార్, సర్వేయర్
నంద్యాల జిల్లా బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సోమవారం సోదాలు జరిగాయి. చుక్కల భూమి రెగ్యులరైజేషన్ కోసం రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఎంఆర్వో రాజీవ్ రెడ్డి, మండల సర్వేయర్ హుస్సేన్ బాషా రెడ్ హ్యాండెడ్గాగా పట్టుబడ్డారు. కార్యాలయం తలుపులు మూసివేసి అధికారులు లోతుగా విచారణ జరిపారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది.