కర్నూలుకు చెందిన 60ఏళ్ల కుమ్మరి మద్దిలేటి గారి హృదయ ధమని పూర్తిగా మూసుకుపోయిన కేసును యశోద హాస్పిటల్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా పరిష్కరించారు. సాధారణ పద్ధతిలో స్టెంట్ వేయడం సాధ్యం కాకపోవడంతో డాక్టర్ ఏ. గురు ప్రకాష్ బృందం రిట్రోగ్రేట్ టెక్నిక్ ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహించారు. హృదయంలోని మరో వైపు ఉన్న సూక్ష్మ రక్తనాళాల ద్వారా ప్రత్యేక వైర్లను పంపి అడ్డంకిని తొలగించడంతో రక్తప్రసరణ పునరుద్ధరించబడిందని వైద్యులు తెలిపారు. క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ పూర్తిగా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చికిత్స విజయవంతమైందని డాక్టర్ గురుప్రకాశ్ వెల్లడించారు.