బనగానపల్లె: ఢిల్లీలో కేంద్ర రోడ్లు రవాణా శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ఢిల్లీ కేంద్ర రోడ్లు, రవాణా శాఖ సెక్రటరీ వి.ఉమాశంకర్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సెక్రటరీతో మంత్రి చర్చించారు. బనగానపల్లి రహదారిని 2 లేన్ల నుంచి 4 లేన్లుగా విస్తరించేందుకు ఆమోదం కోరారు. నూతన ప్రతిపాదనలపై సెక్రటరీ సానుకూలంగా స్పందించారు.