అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బెళుగుప్ప తండా గ్రామంలో గ్రామ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరియు గ్రామస్తులు దాతల దాతృత్వంతో వెలసింది బళ్లారి దుర్గమ్మ దేవత ఆలయం. ఆలయానికి ఇటీవల బెళుగుప్ప మండల జడ్పిటిసి కుమ్మతి మమత త్రిలోక్ రెడ్డి దంపతులు లక్ష రూపాయల విరాళం అందించారు. ఆదివారం గిరిజన తండాలో అసోసియేషన్ అధ్యక్షులు భీమా నాయక్ అధ్యక్షతన ఆలయ మర్యాదలతో స్వాగతించి దుశ్యాలువాలు పూలమాలలతో గ్రామస్తులతో కలిసి సన్మానించారు. గ్రామంలో ఆలయాల అభివృద్ధి గ్రామ అభివృద్ధికి సమైక్యతగా ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు.